ALL CATEGORIES

'రాత్రి చనిపోయింది బాలుడు కాదు'' అన్నాడొక వ్యక్తి. ''వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది''. అన్నాడు రెండో మనిషి, ''కాదు నిశ్చయంగా వృద్దుడే'' అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమూ, ఒకరు అబద్ధమూ చెపుతుంటే, చనిపోయిందెవరు ? వృద్ధుడా ? బాలుడా ? వృద్ధురాలా ? ''పని చేసే కొద్దీ మరింత అభివృద్ధి చెందే అవయవం మెదడొక్కటే.'' అన్నాడు ఐన్‌స్టీన్‌. పాలిష్‌ చేసిన బూట్లు ఎందుకు మెరుస్తాయి ? రెండు + రెండు / రెండు ఎంత ? ఎడిసన్‌ తయారుచేసిన మొదటి బల్బు ఇప్పుడెక్కడ వుంది ? కోళ్ళు గొర్రెలకు రెట్టింపు. వాటి తలల మొత్తం 99. ఏవేవి ఎన్నెన్ని ? పిల్లల్లో లెక్కలు, విజ్ఞాన శాస్త్రాల పట్ల భయం తగ్గించి ఉత్సాహాన్ని పెంచే పుస్తకం ఇది. చార్టర్డ్‌ ఎకౌంటెంటుగా, ఎన్నో ఇంటర్య్వూ బోర్డుల్లో మెంబరుగా ఉన్న అనుభవంతో, ఏ ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పి ఉద్యోగం సంపాదించాలో వివరిస్తూ, యువకుల్లో లేటరల్‌ ధింకింగ్‌ని పెంచటానికి చక్కటి లెక్కల రూపంలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ తయారు చేసిన అంతరంగ వికాస పుస్తకం ఈ బేతాళ ప్రశ్నలు. సాయంత్రం పూట కుటుంబమంతా సరదాగా కలిసి కూర్చుని ఆడుకోవడానికి ఎన్నో ఇంటెలిజెంట్‌+ఫన్నీ పజల్స్‌తో మొదడుకి వ్యాయామం నేర్పే ఇటువంటి పుస్తకం ఇంతవరకూ తెలుగులో రాలేదని చెప్పటానికి ఏ సందేహమూ లేదు.