ALL CATEGORIES

ఎందుకు కొందరు విద్యార్థులకు చదువు అంటే బోర్‌ ? ఎందుకు కొందరికి తెలివితేటలుండీ, ఎక్కువ మార్కులు రావు ? ఎందుకు కొందరికి చదువుమీద ఏకాగ్రత కుదరదు ? ఎందుకు కొందరికి అన్నిటిలోనూ మంచి మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ వస్తాయి ? 'ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి ? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చదవాలి ' అన్న విషయాలపై తెలుగులో ఇప్పటి వరకూ రాని విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. కేవలం విద్యార్ధులే కాదు, తల్లిదండ్రులు కూడా చదవవలసిన పుస్తకం ఇది. ఇరవై నాలుగేళ్ళ వయసులో నెలకి లక్ష రూపాయలు జీతం సంపాదించే స్థాయికి ఒక 'విద్యార్థి'ని తయారు చేసిన రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌, తన ఆలోచనలనూ, స్వానుభవాన్నీ పొందు పరచి తయారు చేసిన ఈ పుస్తకం ప్రతి తల్లి తండ్రీ తమ సంతానానికి ఇవ్వదగ్గ గొప్ప బహుమతి. చక్కటి ఉదాహరణలతో సులభశైలిలో వ్రాసిన ఈ పుస్తకం చదివిన తరువాత, ప్రతి విద్యార్థికీ కలిగే భావం ఒక్కటే. చదువంటే ఇక 'కష్టం' కాదు 'ఇష్టం' అని ఒక విద్యార్ధి యొక్క విజయం నాలుగు అంశాలమీద ఆధారపడి ఉంటుంది. తెలివితేటలు. జ్ఞాపకశక్తి, ప్రతిస్పందన, లౌకిక జ్ఞానం. నాలుగు విభాగాల్లోనూ ఏ విద్యార్థైనా జూశీశీతీ అయితే అతను తప్పకుండా రాజకీయవేత్త అవుతాడు. ఈ దేశంలో రాజకీయవేత్తలకుండే గౌరవమర్యాదలు మీకు తెలుసు గదా - మీ పిల్లలు రాజకీయవేత్తలు కాకుండా ఉండటం కోసమైనా ఈ పుస్తకం మీ పిల్లల చేత తప్పక చదివించాలి.