ALL CATEGORIES

కస్తూర్బా, మహాత్మాగాంధీలను మాతాపితలుగా భావించి మనసారా వారిని సేవించుకున్న ధన్యజీవి ప్రభాకర్‌జీ. సేవాగ్రామ్ ఆశ్రమంలో అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ, అయినవారే అసహ్యించుకొని ఇంటి నుంచి తరిమివేసిన కుష్ఠు రోగులను చేరదీసి, వారి పుండ్లను కడిగి మందులు రాసి సేవలు చేసిన పుణ్య పురుషుడాయన. మనసా వాచా కర్మణా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించడమే కాక, వస్త్రధారణలో సైతం గాంధీజీని అనుకరించి, ఎక్కడ ఉన్నా ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, నిద్రించే ముందు వార్ధాలోని సేవాగ్రామ్‌లో తాను నిద్రించే ప్రదేశంలోనే పడుకుంటున్నట్లు మానసికంగా సంకల్పించుకుంటూ పడుకున్న యోగి పుంగవుడు ప్రభాకర్‌జీ.