ALL CATEGORIES

హేమపాత్ర ”తమ చరణాల చల్లని నీడలో తలదాచుకోవడానికి నాకింత తావే దొరక్క పోతుందా? నాలుగిళ్లలో బిచ్చమెత్తుకుని పట్టెడు మెతుకులు నోట బెట్టుకుంటాను. ఎక్కడో అక్కడ ఏ మర్రినీడలోనో తలదాచుకుంటాను. సేవించుకుంటాను. నామీద మీకింత జాలి కలిగింది కదా. ఇంతకన్నా ఇంకేమి కావాలి స్వామీ!” అని దగ్గర చేరిన దేవదేవి విప్రనారాయణుని ఎలా పతితుని చేసింది? శ్రీరంగనాథస్వామి తన భక్తుని ఎలా అక్కున చేర్చుకున్నాడు చదవండి. పిలకా గణపతి శాస్త్రిగారి మధుర కథనం ‘హేమపాత్ర’.

అశోకవర్ధనుఁడు ఒక వృద్ధురాలి కరుణ రోదనం, ఒక శ్రమణకాచార్యుని బోధన ఒక మహావిజేతను, సమ్రాట్టును పూర్తిగా మార్చివేసి బౌద్ధధర్మం తీసుకునేట్లు చేశాయి. అతని సామ్రాజ్యం అంతరించినా అతని శిలాస్తంభాలూ, ధర్మశాసనాలూ అతనికీర్తికి నిదర్శనాలుగా ఈనాటికీ నిలిచి ఉన్నాయి. అశోక చక్రవర్తి పరివర్తన గాథ గణపతి శాస్త్రిగారి కమనీయ కలం నుండి ‘అశోకవర్ధనుడు’గా.