ALL CATEGORIES

Hinduvulu By Wendy Doniger

Rs. 275 Rs. 248

Availability :

ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్ళటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. తర్వాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు.

అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు. పుట్టుకతోనో ఆచరణరీత్యానో హిందూమతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి - ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది. ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్మకులాలు, నిరక్షరాస్యులు వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణరీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది.