ALL CATEGORIES

Kalaravaalu By Atmakuru Ramakrishna

Rs. 100 Rs. 90

Availability :

Category: Literature Poetry

ఎవరు ఎటువంటి కవిత్వం రాసినా వర్ణమాలలోని 56 అక్షరాల నుండే పదాలను కూర్చుకోవాలి. అక్షరాల ఎన్నిక పదాల పొందికనుబట్టే ఆ వాక్యాలకు అర్థం పరమార్థం ఉంటుంది. మనసులో మెదిలిన భావాన్ని బట్టి హృదయంలో జనించిన భావావేశాన్ని బట్టి పదాలను కూర్చాలనిపిస్తుంది కవికి. ఆ కూర్పులో ఆత్మకూరు రామకృష్ణ తన తోలి ప్రయత్నంగా 'కలవరాలు' పేరుతో కవితాసంపుటిని తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.

"పగలంతా వేడెక్కిన గాలులు

పగలేక చల్లగా వీచెను

కలత చెందిన నీరు

తేట బారెను" అంటారు..

             "నీకు నీవే సాటి" అనే కవితలో. పగలు వేడెక్కిన గాలులు రాత్రి అయ్యాక చల్లగా వీస్తాయి. కలుషితమైన నీరు తెల్లారేటప్పటికి తేటబడిపోతాయి. చంద్రకాంతి కిరణాలలో దాగిన శక్తి అది. ప్రకృతి అందాలను, సహజతత్వాన్ని చక్కగా అధ్యయనం చేసి తన కవిత్వంలో ఆవిష్కరించారు రామకృష్ణ.

                                                                        - తూములూరి రాజేంద్రప్రసాద్