ALL CATEGORIES

Title : Kondakinda Kotturu (కొండకింద కొత్తూరు) Author : Madhurantakam Narendra (మధురాంతకం నరేంద్ర) Publication : Alakananda Prachuranalu (అలకనంద ప్రచురణలు) వూర్లోవుండేటప్పుడైతే, పొద్దునలేచినప్పుట్నించీ, రేత్రి పండుకునేదాంకా, అన్నిపన్లూ యోవురో గమనిస్తావుండారని బయంబయంగా జేస్తాం. యిప్పుడైనా కొంచెం ధైర్యం దెచ్చుకోని, మనకిష్టం వచ్చినట్టు మనం బతకాలగదా! తిండికీ, మందుకూ, నిద్రకూ, అన్నిటికీ రేషనుబెట్టుకోని వూర్లల్లో బతికతావుండాం! యోప్పుడో సమత్సరానికో, ఆర్నెల్లకో, యీమాదిరి చాన్సుదొరికినప్పుడయినా అసలైన బతుకంటే యెట్లుంటాదో తెలుసుకోవాల్నా పన్లేదా? యీ అడువుల్లో దిరిగే మెకాల్ని జూసినప్పుడైనా, ఆ గాల్లో యెగిరే పిట్టల్ని జసినప్పుడైనా, కనీసం యీ బండమీంద పాకే చీమల్నిజూసినప్పుడైనా బతుకంటే యేందో తెలుసుకోగూడదా?... తెలుగు పల్లెలోని నేలబారు మనుషులను ఒకచోట కుప్పబోసి వాళ్ళలో వుండే కొండంత తాత్విక దారిద్రానిన తూకం వేసి చెప్పిన నవల ఇది. పెత్తందారీ కులాన్నీ, ఆ కులంలో ఇంకా ప్రత్యేకమైన రాజకీయ వారసత్వపు కుటుంబాన్నీ రెండు పోగులుగా కలిపినట్లే కలిపి, మళ్ళీ విడదీసి దేని ప్రత్యేకతను దానిగా చర్చించిన నవల ఇది. మెడకు గుదిబండై వేలాడే పొద్దుపోని కాలాన్ని పోసుకోలు కబుర్లతోనూ, వేటతోనూ, ఇస్పేటాకుల జూదంతోనూ మెరిపించుకోజూసే దయనీయ సమూహాల తాత్కాలికపు ఆశావహ స్వప్న రాజ్యం ఈ నవల. - బండి నారాయణస్వామి పేజీలు : 272