ALL CATEGORIES

Maatala Madugu - మాటల మడుగు By Mercy Margaret

Rs. 100 Rs. 90

Availability :

Category: Literature

కొట్టివేత

పునర్లిఖించుకోవాలిప్పుడు

నన్ను నేను

కొత్త కాగితంపైకి అడుగేస్తూ

అందవిహీనంగా చెక్కుకున్న

మునుపటి నన్ను

చిక్కటి సిరాతో కొట్టేయాలి

పాతమాటలకు నిర్తాక్షిణ్యంగా కత్తెరేసి

ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి

పాత పాళీకి కొత్త మాటలు

అభ్యాసం చేయించి

తడిమే ప్రతి చూపులో

వినే ప్రతి మాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి

''కొట్టి వేతలనుంచి కొత్తగా పుట్టుకురావాలి''

మెర్సీ కవిత్వమంతా ఇటువంటి కొత్త భాష కోసం అన్వేషణే. సుసమాజం గురించి, సువ్యవస్థల గురించి ఆలోచించడంకన్నా కూడా ఆమె సమస్య ఎంతసేపూ సుశబ్దంతోటే. తనలో ప్రకంపిస్తున్న భావాల్ని మనకు వెల్లడి చేయడానికి తగిన శబ్ధం దొరుకుతుందా లేదా అనేది ఆమె ఆతృత. ఇట్లాంటి వాక్యాలు మొలకెత్తుతున్న ఈ హృదయంలో ఏ అనుభవాల ఒండ్రు మట్టినో మేటలు వేసిందనీ, సారవంతమైన ఆగామి కాలమొకటి ఈ నేలలోంచి వికసించనున్నదని మనకొక హామి దొరుకుతుంది. - వాడ్రేవు చినవీరభద్రుడు