ALL CATEGORIES

Mainaa - మైనా By Seela Veerraju (Novels)

Rs. 100 Rs. 90

Availability :

పంజరంలో మైనగోరు నిద్రలేవడంతోనే 'రామ రామ' అంది. స్వేచ్ఛను సహృదయంతోనే పంజరంలో పెట్టి బంధించిన మానవుడు ఆవలించి లేచాడు. సాదరంగా ఓసారి దాన్ని పలకరించి అవతలకు వెళ్ళిపోయాడు. సాయి యింకా నిద్ర లేవలేదు. కలలో రెక్కలగుర్రం మీద ఎక్కడికో యెగిరి పోతున్నాడు. మైనా రెండుసార్లు పేరెట్టి పిలిచింది. సాయి అన్నయ్యలేచి సాయిని లేపాడు. సాయి లేవకుండానే విసుక్కున్నాడు. ''నీ మైనా పిలుస్తోందిరా. ఇంకా నిద్రేనా, లే'' అంటూ ఒక్క కుదుపు కుదిపాడు. అయినా లేవలేదు. మైనా మరోసారి పిలిచింది. సాయి వొళ్ళు విరుచుకుని, లేచి నిల్చుని పంజరం దగ్గరకు వచ్చాడు. మైనా ఒక్కసారి రెక్కల్ని టపటపా కొట్టుకుని ఆనందంగా తల ఊపింది. పంజరంలోంచి దాన్ని తీసి బుగ్గమీద పొడిపించుకొని, ముఖం కడుక్కుందామని దొడ్లోకి పరెగెత్తాడు. మైనా మెల్లగా ఎగురుతూ వచ్చి నీళ్ళడేగిఇశా మీద వాలింది. వచ్చేప్పుడు సాయి పంజరం తలుపులు వేసిరాలేదు. ''పోనిలే ఇవ్వాళ నీకూ ఆగష్టు పదిహేను''' అనుకున్నాడు అక్కడకొచ్చిన దాన్ని చూసి. మైనా అరుస్తోంటే ఆలోచనల్ని తెంపుకొని అటు చూశాడు. ఎలా వచ్చిందో నల్లపిల్లి మైనాను నోట కరుచుకుని పారిపోతుంది. పళ్ళ సందుట్లో మైనా ప్రాణం గిజగిజలాడుతోంది. సాయి పెద్దగా అరచుకొంటూ దాన్ని వెంబడించాడు. ఆ వెనకనే సాయి అన్నయ్యా, వాళ్ళమ్మా పరుగెత్తారు. చేజిక్కిన ఆహారాన్ని అది సులభంగా వదిలేయ దలుచుకోలేదు. మూడు నాలుగు యిళ్ళు తిప్పింది. గోడలు దూకింది. చివరకు ఓ యింఇ అటకెక్కి కూర్చుంది. సాయి నిచ్చెన తెచ్చి అటక ఎక్కాడుగాని అప్పటికే నీరసించిపోతున్న మైనా అరుపు ఆఖరిసారిగా వినిపించి ఆగిపోయింది. సాయి కళ్లు నీళ్ళతో తడిసిపోయాయి. ఆ రోజు స్కూలుకు వెళ్ళలేదు. ఇంట్లోనే కూర్చున్నాడు.....