ALL CATEGORIES

Panigrahanam. . . Padirojullo By Govindaraju Madhuri

Rs. 100 Rs. 90

Availability :

Category: Stories

   పుస్తక పఠనం మరియు రచన మీద ఆసక్తి ఎక్కువ. సున్నితమైన హాస్యమంటే చాలా ఇష్టపడతాను. చదువు ఎమ్ ఎస్ సి మూడు దశాబ్దాలు చెన్నై పోర్టు ట్రస్ట్ సంస్థలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ లో ఓ ఆఫీసరుగా పనిచేసి 2013 వ సంవత్సరంలో స్వచ్చంద పదవీ విరమణ చేసి స్వస్థలం గుంటూరులో స్థిరపడ్డాను. ఇది నా రెండవ రచన. ఇది కూడా పాఠకులను ఆనందపరుస్తుందని ఆశిస్తూ...

                                                                            - రచయిత్రి

          ఏ పుస్తకంలో జిలేబి, కాజా, తొక్కుడు, లడ్డు, హల్వా, కజ్జికాయ లాంటి మధురమైన ఆహ్లాదకరమైన పది కథలు వండి వడ్డించారు. ఒక అత్తింటి కోడలు, ఒక కోడలింటి అత్త. ఆ గృహిణి అత్తతోను మొగుడితోను మావగారితోను, భయం లేకుండా భక్తిగా కాపురం చేస్తూ, మొగుడితో తియ్యని బాధలు పడుతూ, తన నోముల పంట తన కొడుకు ముద్దుల భార్య వెంట అడుగులు వేస్తుంటే హైరానాపడుతూ కోడలిచ్చే బహుమతులకు తను పొంగిపోతూ, అవన్నీ మనకోసం కాయితం మీద ఒలక పోసుకుంటూ మనలని అలరిస్తారు. ఈ రచయిత్రిలో నాకు నచ్చిన విషయం కథకి కావలసిన కథా నేపథ్యం గురించి మొత్తం జ్ఞానం ఆవిడకి ఉండటం.

                                                                              - కావనశర్