ALL CATEGORIES

Professor Carvalho - ప్రొఫెసర్‌ కర్వాలొ

Rs. 350 Rs. 315

Title : Professor Carvalho - ప్రొఫెసర్‌ కర్వాలొ Author : Sakhamuru Rama Gopal - శాఖమూరు రామగోపాల్‌ Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : పూర్ణచంద్ర తేజస్వి, Purna Chandra Tejaswi,

Availability :

మూడుగెరె (చిక్కమగళూరు జిల్లాలోని తాలూకా పట్టణం)లో ఉండే తేనె ఉత్పాదకుల సొసైటీకి చెందిన తలుపు నెట్టి నేను లోపలికి ప్రవేశించినప్పుడు, మలెనాడులో వానాకాలం ఆరంభమై అప్పటికే నాలుగు మాసాలు గడిచిపోయినవి కదా! పట్టణమంతా బురదతో అలరారుతుంది. నా కాలి వేళ్ళ సందులలో బురద అసహ్యంగా మెత్తుకొని, ముక్కు నుంచి కారుతున్న చీమిడి, తడిసిన ప్యాంటు ఇత్యాది వాటితో లోపలికి దూసుకెళ్ళాను. బయటున్న ఆఫీసుకు చెందిన నామఫలకంలో రాసిన ''జేను పోశకర సహకారి సంఘ'' (తేనె ఉత్పాదకుల (పోషకుల) సహకార సంఘం)లోని రాతలో 'ష' ఉండాలో లేక 'శ' ఉండాలో అని యోచిస్తూ తలెత్తినప్పుడు వరండాలోపల ఒక పెద్ద హాలు, దాని పక్కన ఒక చిన్నగది కనబడింది. పెద్ద హాలులో ఒక తక్కెడ వేలాడదీసి ఉంది. మరిక లోపలున్న చిన్నగదే ఆఫీసుగా అయ్యుండొచ్చని భావిస్తూ, పెద్దహాలులో ఎవరూ కనబడనందున ఆఫీసు వైపుకు నడిచాను.... పేజీలు :301