ALL CATEGORIES

అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం మొదటిది. 'బ్రహ్మం మూర్థా హరేరేవ' అన్న మాట ప్రకారం ఈ బ్రహ్మపురాణం శ్రీమహావిష్ణువు శిరస్సుగా చెప్పబడింది. ''నానాఖ్యానేతిహాసాడ్యం దశ సాహస్రముచ్యతే'' అనగా ఈ పురాణంలో మొత్తం పదివేల శ్లోకాలున్నాయి. ఇది పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. ఈ పురాణంలో మొత్తం 246 అధ్యాయాలున్నాయి.

పేరుకి ఈ పురాణం బ్రహ్మపురాణం అని వున్నా ఇందులో బ్రహ్మదేవుడికి సంబంధించిన అంశాలు వుండవు. అత్యధికంగా శ్రీమహావిష్ణువు గురించిన విశేషాలు, కథనాలే ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అందుకే ఈ పురాణాన్ని వైష్ణవ పురాణంగానే కీర్తిస్తారు.