ALL CATEGORIES

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. "కూర్మం పృష్ఠం సమాఖ్యాతం" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వార్థంలో 53 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది.

- ప్రకాశకులు