ALL CATEGORIES

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాందపురాణం. "స్కాంద పురాణం రోమాని" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. "ఏకాశీతి సహస్రాంతు స్కాందం సర్వాఘకృంతనమ్" అనగా సకల పాపాలను పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. "యత్రస్కందః స్వయంశ్రోతా వక్తాసాక్షాన్మహేశ్వరః". పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని ఉపదేశిమ్చగా శ్రద్ధగా విన్న స్కందుడు తిరిగి దాన్ని మహామునులకి తాను ఉపదేశించాడు. అన్ని పురాణాల కన్నా స్కాందపురాణం చాలా పెద్దది.

- ప్రకాశకులు