ALL CATEGORIES

Sree Vayu Puranam - శ్రీ వాయు పురాణం By Jayanti Chakravarthy

Rs. 60 Rs. 54

Availability :

అష్టాదశ పురాణాలలో నాలుగోది వాయుపురాణం. వాయుదేవుడు వక్తగావున్న కారణంగా ఈ పురాణానికి వాయుపురాణం అన్న పేరు వచ్చింది. 'వాయుర్వామోమహేశితు:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువుకి ఎడమభుజంగా కీర్తించబడింది. 'చతుర్వింశతి సాహస్రం పురాణంతదిహోచ్యతే' అనగా ఈ దివ్య పురాణంలో మొత్తం 24 వేల శ్లోకాలున్నాయి. అయితే ప్రస్తుతం లభిస్తున్న వాయుపురాణంలో 10991 శ్లోకాలే మనకు కనిపిస్తాయి.

వాయుపురాణం 1. ప్రక్రియాపాదం 2. ఉపోద్ఘాత పాదం 3. అనుషంగ పాదం 4. ఉపసంహార పాదం అని నాలుగు పాదాలుగా విభాగించబడింది. ఈ నాలుగు పాదాలతో కలిపి మొత్తం 112 అధ్యాయాలున్నాయి. భారతదేశంలో సుప్రసిద్ధ దివ్యక్షేత్రమైన 'గయ' గురించి ఈ పురాణం విస్తృతంగా వర్ణిస్తుంది.