ALL CATEGORIES

Valasa By V.R.Rasani (Novels)

Rs. 180 Rs. 160

Availability :

‘మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఋణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట్టికీ, ఆ నీటికీ, ఆ గాలికీ ఎంతవరకు ఋణం వుంటుందో అంతవరకు ఆ మట్టిమీదే జీవిస్తాడు. చివరికి ఈలోకం ఋణం ఎక్కడ తీరిపోతుందో అక్కడే ఆ మనిషి అదేమట్టిలో కలిసి పోతాడు. వలస జీవుల్ని ఈ తాత్త్వికతే పట్టి బతికిస్తుంటుంది’. ఈ జీవిత సత్యాన్ని తెలిపే ఓ మట్టిమనిషి యథార్థ, వ్యథార్థ జీవిత చిత్రణే. సాంస్కృతిక, తాత్త్విక రచయితగా ప్రసిద్ధుడైన డా.వి.ఆర్.రాసాని కలం నుంచీ జాలువారిన అరుదైన, విశిష్టమైన నవల ఈ ‘వలస’. Pages : 212