ALL CATEGORIES

Varthamana China By Mathyu John

Rs. 150 Rs. 135

Availability :

తక్కువ అక్షరాస్యత, జనాభా ఉన్నప్పటికీ తక్కువ వృద్ధిరేటులో అదేవిధమైన అభివృద్ధిపదంలో ఉన్న, వికాశం చెందుతున్న ప్రజాస్వామ్యదేశం భారతదేశం. మార్కెట్ శక్తులమీద ఆధారపడ్డ చైనా సామ్యవాదం నుండి మన దేశం నేర్చుకోవలసిన గుణపాఠాలేమిటి?

ఒకటి, స్పష్టమైన సమైక్యతతో అన్ని స్థాయిల్లోనూ, ప్రాంతాల్లోనూ శిగ్రఆర్ధిక లక్ష్యం పట్ల నిబద్ధత. రెండు, సమర్ధమైన పాలన, నిర్వహణశైలి, పెద్దఎత్తున ఎఫ్ డిఐలను ఆకర్షించడానికి వీలుగా అన్ని ప్రధాన నగరాలు, వృద్ధిప్రాంతాలలో మౌలికవసతుల నిర్మాణం.

చైనా - భారత దేశాలు రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఉన్న వర్తమానశక్తులు. తన అత్యున్నత వృద్ధిరేటు స్థానాన్ని చైనా అధిగమించగా భారతదేశం ఇంకా ఆ స్థానం చేరుకోలేదు. రాబోయే సంవత్సరాలలో భారతదేశం చైనా వృద్ధిరేటును అధిగమించవచ్చునని అంచనా.

- మాధ్యూ జాన్

రచయిత గురించి :

మాధ్యూ జాన్ సీనియర్ ఐపిఎస్ అధికారి. డైరక్టర్ జనరల్ అఫ్ పొలిసుగా పనిచేశారు. బహు దేశాలు పర్యటించారు. పదవీ విరమణ చేసిన తరువాత తన విదేశయానాన్ని ప్రయోజనకరమైన కార్యకలాపంగా మార్చుకున్నారు. చైనాలో విస్తృతంగా పర్యటించి, చైనా గురించి విపులమైన సమాచారాన్ని సేకరించి 'వర్తమాన చైనా' అన్న ఈ పుస్తకాన్ని రచించారు. సంక్షిప్తంగా చైనాదేశ చరిత్రను వివరిస్తూ, నేటి చైనా ఆర్ధిక, సామజిక, సాంస్కృతిక, రాజకీయ నిర్మాణాన్ని, అభివృద్ధిక్రమాన్ని విశ్లేషించారు.