ALL CATEGORIES

Vekuva Pata Kathaa Samputi - వేకువ పాట కథా సంపుటి By Varanasi Nagalakshmi

Rs. 150 Rs. 135

Availability :

Category: Literature

  సంక్లిష్ట వర్తమాన సామాజికార్థిక పరిస్థితులలో జీవితంలో రంగులు, రాగాలూ మాసిపోకుండా మూగపోకుండా చూసుకొనటానికి మనుషులు నిరంతరం చేయాల్సిన, కనపడని యుద్ధాల గురించిన వేకువ పాటలు, ఈ కథలు. మనుషులు తమ లోపలికి తాము చూచుకొనటానికి, మనో లోకాలలోని కాలుష్యాల నుండి విముక్తం కావటానికి, సహాయపడే కథలు ఈ 'వేకువ పాటలు'.

    మార్పు జీవలక్షణం. దాన్ని సమ్మతించాలి, స్వాగతించాలి. అయితే ఆ దారిలో ఆచి తూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. ప్రాణవాయువునిచ్చే చెట్టూ చేమా తీసేసి కట్టే కర్మాగారాలూ, వాటిలో ఉత్పత్తి చేసే వస్తు సముదాయాల అవసరమెంత? ఒకే ఇంట్లో ఉండే కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నిలుపుకోలేనపుడు, వారి కుశలం కనుక్కునే తీరిక లేనపుడు, భూగోళానికి అవతలివైపున్న వ్యక్తితో ఎంత కమ్యూనికేషన్‌ ఉండి ఏం లాభం? మన పొలాల్లో పండే ఆహారధాన్యాల ఉత్పత్తి, వినియోగం గురించి ఆలోచించకుండా, మరో ఖండంలో పండే అపురూప ఫలాలు ఇక్కడే దొరికేలా చేసే వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే నష్టం ఎవరికి?

    మనిషిని మనిషికి కలిపి కట్టే అనుబంధాలు తెగిపోకుండా ఉండాలంటే యంత్రాల మీద మన ఆధీనత ఎంతవరకో తెలుసుకోవాలి. రెండు వైపులా పదునున్న కత్తిని వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. మౌలికమైన ఈ ఆలోచనలే నన్నీ కథలు రాసేందుకు పురికొల్పాయి.       - వారణాసి నాగలక్ష్మి