ALL CATEGORIES

మనకు ఉన్న ప్రధాన సమస్య పిల్లలను ఎలా విద్యావంతులను చేయాలన్నది కాదు, ఉపాధ్యాయులను ఎలా విద్యావంతులను చేయాలన్నదే.

విద్య అంటే ఎలా లెక్కలు చేయాలో, ఎలా వంతెనలు కట్టాలో, అణుశక్తినెలా ఉపయోగించుకోవాలో నేర్చుకొనే ప్రక్రియ మాత్రమే కాదు. అల్పత్వాన్నుండి, అవివేక పూరితమైన ఆకాంక్షల నుండి మనిషి బయట పడడంలో సహాయపడడం విద్య యొక్క ప్రధాన ధర్మం.

        శతాబ్దాలా భారాన్ని మోసుకొని వస్తున్న అజ్ఞత మనసుకు గల అనేక పొరలలోని బలమైన శక్తులను, సూక్ష్మమైన అంశాలను ప్రాజ్ఞతతో, వివేకంతో పరిశీలించాలి. 'నేను' అనే సంకుచిత పరిధి నుండి స్వేచ్ఛ పొందడానికి విద్య తోడ్పడాలి.

విద్యకు సరైన అర్ధం తన గురించి తాను తెలిసికోవడమే. తనను తాను తెలిసికొంటే విశ్వాన్నంతా తెలిసికొన్నట్లే.