ALL CATEGORIES

వంద కథల విందు ''రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట'' అంటాడు కథకులందరికీ ప్రాత:స్మరణీయుడు మపాసా. ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని. దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి.